YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇరిగేషన్ పనులకు జీఎస్టీ మోకాలడ్డు

 ఇరిగేషన్ పనులకు  జీఎస్టీ మోకాలడ్డు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అభివృద్ధి పనులకు జీఎస్టీ అడ్డుగా నిలుస్తోంది. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అభివృద్ధి పని మంజూరు చేసిందో ఆ లక్ష్యం పక్కదారి పడుతోంది. గతేడాది నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఎంత విధించాలనే దానిపై ఏడాదిగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో నీటిపారుదలశాఖ, రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్‌, తాగునీటి సరఫరా విభాగం వంటి ప్రధాన శాఖల్లో కోట్లాది రూపాయిలు బిల్లులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబించడంతో ఆ ప్రభావం అభివృద్ధి పనులపై పడుతోంది.  వ్యాట్‌ ఉండేది. దానిని కూడా జీఎస్టీలో కలిపారు.చేసిన పనులకు జీఎస్టీ ఎవరు చెల్లించాలనే దానిపై నెలకొన్న మీమాంస అధికారులు, కాంట్రాక్టర్లు గందరగోళానికి తెర తీస్తోంది. రూ.కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు పనుల నిర్వహణపై ఆసక్తి చూపడం లేదు. పనుల్ని సైతం అసంపూర్తిగానే వదిలేస్తున్నారు. ఇది తేలిన తర్వాతే మిగిలిన పనిని చేద్దామనే ధోరణిలో వారున్నారు. కొన్నిశాఖల్లో జీఎస్టీ ఎంత సొమ్ము ఉంటుందో ప్రాథమిక అంచనాతో ఆ పనిని పక్కనబెట్టి మిగిలిన పనిని చక్కబెడుతున్నారు.రహదారులు భవనాలశాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.600 కోట్లు పనులు రెండు జిల్లాలో ఉన్నాయి. ఇందులో రహదారుల నిర్మాణం, భవనాలు, వంతెనలు ఉన్నాయి. మిషన్‌ భగీరథ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు రూ.191 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మరో రూ.170 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మిషన్‌ భగీరథ పనుల్లో జీఎస్టీ ప్రభావంతో పనుల నిర్వహణ పూర్తిగా మందగించింది. 2017 డిసెంబరు ఆఖరు నాటికి గోదావరి జలాలు అందిస్తామన్న నాయకుల మాటలున నీటి మూటలయ్యాయి. ఈ విధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.జీఎస్టీ 12శాతం అని, కాదు 18శాతం అని ఎవరికివారు సొంత వ్యాఖ్యానాలు జోడించారు. 18 శాతంలో గతంలో ఉన్న 5 శాతం వ్యాట్‌ తీసేస్తే మిగిలిన 13శాతం జీఎస్టీ అని, కాదు 12 శాతం లోంచి 5 శాతం తీయాలని ఇలా కాంట్రాక్టర్లు ఎవరిష్టం వచ్చినట్లు వారు భావించడం, అధికార యంత్రాంగానికి సైతం స్పష్టమైన ఉత్తర్వులు రాకపోవడంతో ఆ ప్రభావం అభివృద్ధి పనుల నిర్వహణపై పడింది. ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసినా సర్కారు దీనిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో బిల్లులు ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వివిధ శాఖల్లో  కోట్లాది రూపాయిలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.‘మిషన్‌ కాకతీయ’లో నాలుగు దశల్లో ప్రభుత్వం రూ.850 కోట్లు మంజూరు చేసింది. ఇవికాక ఆర్‌ఆర్‌ఆర్‌ పథకం కింద మరో రూ.92కోట్లు పనులు మంజూరయ్యాయి. ప్రస్తుతం అనేక పనులు ముగింపు దశలో నిలిచిపోయాయి. 

Related Posts