విశాఖపట్నం
విశాఖ వైసీపీ కార్యాల యంలో సంక్రాంతి సంబరాలు ఘ నంగా జరిగాయి.రాష్ట్ర మాహిళ విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గోన్నారు. భోగి మంటలు, సంక్రాంతి మగ్గులతో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సంక్రాంతి అంటే రైతుల పండుగని,రాష్ట్రంలో గడచిన ఏడు నెలలుగా వ్యవస్థలను నీరు గార్చారని, రైతులకు అన్యాయమే జరుగుతోందని మాజీ మంత్రి అమర్ అన్నారు. సంక్రాంతి రైతుల పండుగ అయినప్పటికీ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవని,రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.