విజయవాడ, జనవరి 15,
విజన్ ఉన్నవారికి దూరదృష్టి ఎక్కువ. భావితరాల గురించి ఆలోచన చేస్తారు. సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. పనులు త్వరగా జరిగేలా చేస్తారు. వ్యయ ప్రయాసలు లేకుండా చూస్తారు. ఉపాధి కల్పనపై దృష్టి పెడతారు.విజన్ ఉంటే.. ఎంత కష్టమైన పని అయినా సులభం అవుతుంది. భావి సమస్యలను పరిష్కరిస్తుంది. ఆటంకాలను తొలగిస్తుంది. అవసరాలను తీరుస్తుంది. వ్యయ ప్రయాసలు లేకుండా చేస్తుంది. రాజకీయాల్లో మంచి విజన్ ఉన్న నేతగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గుర్తింపు ఉంది. టెక్నాలజీని విరివిగా వినియోగించడంలో ఆయన దిట్ట. తెలంగాణ రాజధాని అభివృద్ధికి ఆయన విజనేకారణం. ఇప్పుడు ఏసీ సీఎంగా మరో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో వాట్పాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నారు.ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్న వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంట్లో నుంచే సేవలను పొందవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, కులం, నివాసం, ఆదాయం వంటి 150 సర్వీస్‌లు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ప్రజల సమస్యలు, ఇబ్బందలు తొలగించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. సమయం వృథా కాకుండా ఉండడమే కాకుండా డబ్బులు ఆదా అవుతాయని అధికారులు పేర్కొంటున్నారుదేశంలో 64 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ప్రజలకు ఇస్తుంది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనే లక్ష్యాలతో ప్రభుత్వం నూతన సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పెన్షన్లు రెట్టింపు చేశారు. దీంతో పేదల ఆదాయం పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్లద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇక పైపులైన్ ద్వారా వంటగాయస్ సరఫరాకు చర్యలు చేపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పెండింగ్‌లో ఉన్న రూ,6,700 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది పల్లెలకు పండుగ కళ వచ్చిందని సీఎం తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు పండుగలు కూడా ప్రశాంతంగా జరుపుకోలేకపోయారని తెలిపారు. ప్రతీపల్లె, ప్రతీ ఇల్లు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే స్వర్ణాంద్ర విజన్ –2047 కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలని ఆకాంక్షించారు. ఇక సూపర్‌సిక్స్ పథకాల అమలుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.