YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఎయిర్‌పోర్టులో నూతన సేవలు.

విశాఖ ఎయిర్‌పోర్టులో నూతన సేవలు.

విశాఖపట్టణం, జనవరి 15, 
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దుతున్న ఏపీ ప్రభుత్వం.. విశాఖపట్నం అభివృద్ధిపైనా దృష్టి సారించింది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబయి ఎలా మారిందో.. అదే తరహాలో ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖను మారుస్తామని చంద్రబాబు ఇటీవలే మరోసారి స్పష్టం చేశారు. ఆ దిశగానే విశాఖపట్నంలో గూగుల్, లులూ వంటి అంతర్దాతీయ సంస్థలను పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పించింది. తాజాగా విశాఖపట్నం పారిశ్రామిక అభివృద్ధిలో కీలక అడుగు పడింది. విశాఖపట్నం నుంచి దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తుల రవాణాకు త్వరలోనే మార్గం సుగమం కానుంది2019-20 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సుమారుగా 470 టన్నుల అంతర్జాతీయ కార్గో రవాణా జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఆ తర్వాతి కాలంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో సేవలు నిలిచిపోయాయి. వీటికి కూడా పలు కారణాలు ఉన్నాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిబంధనల ఉల్లంఘన కారణంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ కార్గో సేవలు నిలిచిపోయాయి. దీంతో ఏదైనా సరుకును ఎగుమతి చేయాలంటే ఇక్కడి పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరుకును ఎగుమతి చేయాలంటే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటిచోట్లకు రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తు్న్నారు.అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో సేవలు మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది, రెండేళ్లపాటుకార్గో నిర్వహణ చేపట్టేందుకు ముందుకొచ్చింది. సరుకు తనిఖీల దగ్గర నుంచి లోడింగ్, అన్ లోడింగ్ వరూ అన్నింటి ఖర్చులను ఏపీటీపీసీ భరిస్తుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నుంచి అనుమతులు తీసుకుని.. మూడు వారాల్లో సేవలు ప్రారంభించనున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts