YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతులకు సూచనలిచ్చిన స్పీకర్ కోడెల

రైతులకు సూచనలిచ్చిన స్పీకర్ కోడెల

వ్యవసాయ శాఖ, రిలయన్స్ ఫౌండేషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ రైతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు  రైతులతో మాట్లాడారు. సత్తెనపల్లి ఎన్ఎస్పీ  గెస్ట్ హౌస్ లో ఏర్పాటు ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ ద్వారా రైతులకు పచ్చిరోట్ట ఎరువులు, రైతులు వ్యవసాయం దండగా కాకుండా తక్కువ పెట్టుబడితో వ్యవసాయం ఎలా చేయాలన్న దానిపై సలహలు, సూచనలు ఇచ్చారు. కోడెల మాట్లాడుతూ  దేశంలోనే రైతులకు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమని అన్నారు. మిర్చి పంటలు వేసే రైతులు పంట మార్పిడి అనేది చేసుకోవడం లేదు అందు వల్ల భూసారం తగ్గుతుంది. కాబట్టి మినుము, పెసరా ,జీలుగా వంటి పచ్చిరోట్ట విత్తనాలు వేసి తోక్కిస్తే భూసారం, భూమి బలం పెరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడైనా మిర్చికి బోబ్బర తెగులు వచ్చిందేమో కాని గత సంవత్సరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో తీసుకున్న జాగ్రత్త కారణంగా ఇక్కడ బోబ్బర పెద్దగారాలేదని అన్నారు. పచ్చిరోట్ట తోక్కించిన పోలాల్లో  గతంలో మిర్చి దిగుబడి పెరగడంతో పాటు..  కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన మిర్చిపంట  కలర్ మారలేదు. నీరు ఎక్కువగా ఉనట్లయితే జనుము ఎక్కువగా వేసుకోంటే  దీనీవల్ల పచ్చిరోట్ట ఎక్కువగా ఉంటుందని అన్నారు. నీరు తక్కువగా ఉన్నవారు పిల్లిపెసర వేసుకోంటే పచ్చిరోట్ట బాగుంటుంది. గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పల్నాడు ప్రాంతంలోని రైతులకు ఆరు తడులకు నీరు ఇవ్వడం జరిగిందని అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై ప్రభుత్వం అంత  కఠిన చర్యలు  తీసుకుంటుంది. జిప్సమ్, బోరాన్ వాడే రైతులు భూసార పరీక్షలు చేయించుకోని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మన తాతల, తండ్రుల కాలం నుండి ఉన్న పంటను మార్పిడి విధానాన్ని రైతులు ఫాలో కావడం లేదు కాబట్టే భూ సారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయి. సవుడు నేలలు తట్టుకోని మంచి దిగుబడి రావాలంటే జిప్సమ్ వాడితే మంచి ఫలితాలు వస్తాయని అయన సూచించారు.  ఈ టెలికాన్ఫరెన్స్ లో నియోజకవర్గంలోని 40గ్రామాల నుండి 49మందికి పైగా రైతులు పాల్గోన్నారు. 

Related Posts