విజయవాడ
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి పాములు కాలవద్ద కోడి కత్తి క్రీడల ఆర్గనైజర్ పరుచూరి ప్రసాదు బరిలో ఓ వ్యక్తిని అకారణంగా కొడుతున్న దృశ్యం మీడియా కంటపడింది. వాళ్లే కొట్టుకొని చస్తారులే అని కొత్తపేట పోలీసులు చేతులెత్తేశారని ఈ ప్రాంతంలో గుసగుసలు బలంగా వినపడుతున్నాయి.
గత సంవత్సరం కోడిపందాలు నిర్వహించడంతో ఓ వ్యక్తి కొత్తపేట పోలీసులు ఆర్టిఏ యాక్ట్ ద్వారా అడగగా కోడిపందాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని కొత్తపేట పోలీసులు వివరణ ఇచ్చారు..
సోషల్ మాధ్యమాల్లో మరియు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారాలుగా పెట్టుకుని మరల ఆర్టిఏ యాక్ట్ ద్వారా కోడిపందాలకు అనుమతులు ఏమైనా జారీ చేశారా లేదా అని వివరణ కోరి కొత్తపేట పోలీసులు సమాచారాన్ని బట్టి హైకోర్టును ఆశ్రయించేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.