న్యూఢిల్లీ
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోమని సుప్రీం స్పష్టం చేసింది. దాంతో కేటీఆర్ తరపు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని కోర్టుకు విన్నవించుకున్నారు. బుధవారం నాడు జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం కేసును విచారించింది. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సుదరం వాదనలు వినిపించారు. ఇది కక్ష సాధింపుతో పెట్టిన కేసు ప్రభుత్వం మారగానే కేసు పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం గుర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్ ఎం డి ఎ ను నిందితులుగా చేర్చలేదని వాదించారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్ రొహత్గి వాదనలు వినిపించారు. దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశా. గవర్నర్ దర్యాప్తుకు అనుమతి ఇచ్చారని వాదించారు.