ముంబాయ్ జనవరి 15
భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధనౌకలు వచ్చి చేరాయి. అధునాతన ఐఎన్‌ఎస్ సూరత్ ఐఎన్‌ఎస్ నీలగిరి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ యుద్ధనౌకలను ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ప్రధాని మోదీ వీటిని ప్రారంభించారు. అనంతరం మూడు నౌకలను జాతికి అంకితం చేశారు. ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వీటి రాకతో నేవీ బలం పెరుగనుంది.యుద్ధ నౌకలు భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందన్నారు. ప్రపంచంలో బలమైనశక్తిగా భారత్ మారుతోందని వ్యాఖ్యానించారు.
దేశీయ విధానంలోయుద్ధనౌకల విశేషాలు..
ఐఎన్‌ఎస్ సూరత్.. ఇది పీ15B గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసిన నాలుగో యుద్దనౌక. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్ వార్‌షిప్‌లలో ఒకటి. దీనిని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.
ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక. దీనిని శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండటం దీని సామర్ధ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలను సూచిస్తుంది.
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 స్కార్పెన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ భాగస్వామ్యమైంది. సముద్ర భద్రతలో ఈ యుద్ధనౌక కీలకం కానున్నది.యుద్ధనౌకల తయారీ గర్వకారణమన్నారు.