YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భావ‌సారూప్యం లేని పార్టీల‌తో కాంగ్రెస్ అప‌విత్ర క‌లయిక‌ బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్

భావ‌సారూప్యం  లేని పార్టీల‌తో కాంగ్రెస్ అప‌విత్ర క‌లయిక‌          బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్

సిద్ధాంతాలు మ‌రిచి భావ‌సారూప్యం  లేని పార్టీల‌తో కాంగ్రెస్ అప‌విత్ర క‌లయిక‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు. మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క‌లో సిద్ధాంతాల‌కు తిలోద‌కాలిచ్చి మోదీ, బిజెపిపై ధ్వేషంతో కాంగ్రెస్‌, టీఆర్ఎస్,టీడీపీలు చేతులు క‌ల‌ప‌డం దేనికి సంకేతాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు.పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ మాట్లాడుతూ... కేసీఆర్, చంద్ర‌బాబుల సూచ‌న‌ల మేర‌కే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టామ‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి వెల్ల‌డించార‌ని,  అలాగే సోనియా, రాహుల్ పాల్గొన్న స‌భ‌లో టీడీపీ నేత చంద్ర‌బాబు పాల్గొనడం ఆయా పార్టీల అధికార దాహానికి ప్ర‌తీక‌గా నిలిచింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు.డెబ్బై ఏళ్ల స్వ‌తంత్ర భారతంలో కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించినప్ప‌టికీ ద‌ళితులు ఇంకా వెనుక‌బ‌డే ఉన్నార‌ని, దీనికి కాంగ్రెస్ కార‌ణం కాదా ? అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. ద‌ళిత సంక్షేమ ప‌థ‌కాల నిధులు కాంగ్రెస్ నేత‌ల సంక్షేమానికే దోహ‌ద‌ప‌డ్డాయ‌ని, ద‌ళితుల జీవితాల్లో వెలుగులు నింపే ప్ర‌య‌త్నం కాంగ్రెస్ ఏనాడూ చేయ‌లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ దుయ్య‌బ‌ట్టారు.  కాంగ్రెస్ పార్టీ ద‌ళితుల‌ను, గిరిజ‌నుల‌ను కేవ‌లం ఓట‌ర్లుగానే గుర్తించింది త‌ప్ప‌ .. ఏనడూ వారికి సరైన న్యాయం చేయ‌లేదన్నారు. అందువ‌ల్ల‌నే నేటికీ అనేక‌మంది ద‌ళిత, గిరిజ‌నులు ఇంకా దారిద్ర్య రేఖ‌కు దిగువ‌నే ఉన్నార‌న్నారు.ముఖ్యంగా ద‌ళిత, గిరిజ‌నులపై కాంగ్రెస్ హాయంలో జ‌రిగిన‌న్ని అత్యాచారాలు ఏనాడు జ‌ర‌గ‌లేద‌ని, యూపీఏ హ‌యాంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అఖిలేష్ యాద‌వ్ ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ద‌ళితుల‌పై జ‌రిగిన అత్యాచారాలు, అకృత్యాలు వ‌రంగ‌ల్ స‌భ‌లో పాల్గొన్న నేత‌ల‌కు గుర్తుకురాక‌పోవ‌డం నిజంగా హేయ‌నీయమ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.  అలాగే నాలుగేళ్లుగాఈరాష్ట్రంలోద‌ళిత‌, గిరిజ‌నుల‌పైఅనేకదాడులు, దౌర్జ్యన్యాలు, అత్యాచారాలు, అకృత్యాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప‌ళ్లెత్తు మాట అన‌ని నేత‌లు కేంద్రంలోని శ్రీ న‌రేంద్రమోదీ ప్ర‌భుత్వంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం శోచ‌న‌నీయ‌మ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. ద‌ళితుల స‌మ‌స్య‌లు, వారు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌పై ఒక్క‌రూ మాట్లాడ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. 1985 జులై 17న జ‌రిగిన కారంచేడు ఊచ‌కోత‌, నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్నపుడు జ‌రిగిన చెండూరు ద‌ళితుల హ‌త్య‌లు, జ‌గ‌న్నాధ్ మిశ్రా నేతృత్వంలోని ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన బీహార్ బాదాని ఊచ‌కోత‌ల గురించి కాంగ్రెస్ నేత‌లు మ‌రిచినా.. ఈ దేశ ప్ర‌జ‌లు మ‌ర‌వ‌ర‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ గుర్తుచేశారు.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర‌ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తీసుకువ‌స్తున్న‌ద‌ని, ఈ స‌మాచారం తెలుసుకున్న నేత‌లంతా త‌మ పోరాటాల వ‌ల్ల‌నే ఈ ఆర్డినెన్స్ వ‌స్తుంద‌ని చెప్పుకునే ప్ర‌యత్నం చేస్తున్నార‌న్నారు.ద‌ళిత‌, గిరిజ‌నుల అభ్యున్న‌తికి బిజెపి అనేక అవకాశాలు క‌ల్పించిందని, ముఖ్యంగా బిజెపికి రెండుసార్లు రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు మైనారిటీ వ‌ర్గానికి చెందిన ఏపీజే అబ్దుల్‌క‌లాం, ద‌ళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం క‌ల్పించార‌న్నారు. యూపీఏ 1, యూపీఏ -2 ప‌రిపాల‌న‌లో కాంగ్రెస్ పార్టీ ద‌ళితులైన మీరాకుమార్‌, సుశీల్ కుమార్ షిండే, వెంక‌ట‌స్వామికి అవ‌కాశం ఇవ్వ‌కుండా,  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిభాపాటిల్, ప్ర‌ణ‌బ్ ముఖర్జీని ఎన్నుకున్నార‌న్నారు.  తెలుగుబిడ్డ ద‌ళితుడైన వెంక‌ట‌స్వామిని ఎందుకు రాష్ట్ర‌ప‌తిని చేయ‌లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ కాంగ్రెస్‌ను ప్ర‌శ్నించారు. ముఖ్యంగా  79 మంది ద‌ళిత ఎంపీలు, 543 మంది ద‌ళిత ఎమ్మెల్యేలు బిజెపిలో ఉన్నార‌న్న అంశాన్ని కాంగ్రెస్ నేత‌లు మ‌రిచిపోయారని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ భావజాలాన్ని విశ్వ‌వ్యాప్తం చేయ‌డం కోసం పంచ్‌తీర్ధ్ పేరిట  మోదీ ప్ర‌భుత్వం అంబేద్క‌ర్ పుట్టిన స్థ‌ల‌మైన మౌ గ్రామాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా, చ‌ద‌విన లండ‌న్ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా, దీక్ష‌భూమి అయిన నాగ్‌పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌డంతో పాటు చైత్య‌భూమి ముంబై, విద్యాభ్యాసం చేసిన ప్రాంతం, అలాగే మ‌హాప‌రినిర్వాన్ ప్రాంత‌మైన న్యూఢిల్లీలో మెమోరియ‌ల్ ఏర్పాటు చేశార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.ఈ దేశంలో 496 యూనివ‌ర్సిటీల్లో వైస్‌-ఛాన్స‌ల‌ర్ పోస్టులుంటే కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కేవ‌లం ఆరుగురు ఎస్సీలు, ఆరుగురు ఎస్టీలకు మాత్ర‌మే అవకాశం క‌ల్పించింద‌ని, అదే బిజెపి హ‌యాంలో అనేక మంది ఎస్సీ, ఎస్టీల‌ను ప‌లు యూనివ‌ర్సిటీల‌కు వైస్ - ఛాన్స‌ల‌ర్‌లుగా నియ‌మించిన ఘ‌న‌త మోదీ ప్ర‌భుత్వానిద‌న్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అంబేద్క‌ర్ ను రెండుసార్లు ఓడించిన చ‌రిత్ర కాంగ్రెస్‌ద‌ని, అలాగే పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాలులో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాన్ని కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయ‌లేక‌పోయింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ దుయ్య‌బ‌ట్టారు.1980 లో జరిగిన దేశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అప్ప‌టి జ‌నతా పార్టీ బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్‌ని ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా చేయ‌కుండా కాంగ్రెస్ కుట్ర‌లు ప‌న్ని ఓడించింద‌ని, ఆ ఎన్నిక‌ల్లో ద‌ళితుడు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఇందిరాగాంధీ నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అడ్డుకుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ పేర్కొన్నారు. జ‌గ్జీవ‌న్ రామ్ కూతురైన మీరాకుమార్ కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్ర‌శ్నించ‌డం మానేసి బిజెపిని ప్రశ్నించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేను క‌ర్ణాట‌క‌లో ఎందుకు ముఖ్య‌మంత్రిని చేయ‌లేక‌పోయింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్రశ్నించారు.2017 లో ద‌ళిత పారిశ్రామిక వేత్త‌ల అభివృద్ధి కోసం  ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ స్టాండ‌ప్ ఇండియా కింద రూ. 500 కోట్లు కేటాయించారని, 2018-19 లో ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి కోసం రూ. 95 వేల కోట్లను శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌భుత్వం కేటాయించిందని అలాగే మోదీ హ‌యాంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి 50  కంపెనీలు వెంచ‌ర్ క్యాపిట‌లిస్టులుగా ఉన్నాయని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు. స్టాండ‌ప్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా , ముద్రాయోజ‌న ద్వారా ఎస్సీ,ఎస్టీ యువ‌త‌కు కోటి రూపాయ‌ల వ‌ర‌కు రుణాలిచ్చి వారిని పారిశ్రామిక వేత్త‌లుగా తీర్చిదిద్దుతున్న ఘ‌నత మోదీ ప్ర‌భుత్వానిద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ వెల్ల‌డించారు. మోదీ ప్ర‌భుత్వం అనేక ప్రజాసంక్షేమ ప‌థ‌కాలు, వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి పేద‌ల అభ్యున్న‌తికి విశిష్ట కృషి  చేస్తుంద‌ని, పేద‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌, జ‌న్‌ధ‌న్ యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి సుక‌న్య‌యోజ‌న‌, అన్న‌దాత‌ల కోసం  ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న, బేటీ బ‌చావో-బేటీ ప‌డావో వంటి అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు.ప్ర‌ధాని మోదీ పాల‌న న‌చ్చడం వ‌ల్లే  దేశంలోని 21 రాష్ట్రంలో ఇవాళ బిజెపి అధికారంలో ఉంద‌ని, ముస్లింలు అధికంగా క‌శ్మీర్‌లో, క్రైస్త‌వులు అధికంగా గ‌ల నాగాలాండ్‌, బౌద్ధులు అధికంగా ఉన్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో, అలాగే ఎస్సీలు అధికంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో, బీసీలు అధికంగా గ‌ల బీహార్‌లో, ఎస్టీలు అధికంగా ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.ఈ దేశంలో  ప్రధాని న‌రేంద్ర‌మోదీ పాల‌న‌ను ప్ర‌జ‌లు ఆమోదిస్తున్నార‌ని,  అప‌విత్ర కూట‌ముల‌తో  వ్య‌తిరేక స్వ‌భావంతో ఆయా పార్టీలు వేదిక‌ల‌పై దూషించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని డాక్ట‌ర్ లక్ష్మ‌న్ అన్నారు. ద‌ళితుల‌కు సామాజిక న్యాయం అందేవ‌ర‌కు బిజెపి నిరంతర కృషి చేస్తూనే ఉంటుంద‌ని, 2019 లో కూడా మోదీ పాల‌న‌నే  ఈ దేశ ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని, తెలంగాణ‌లో సైతం బిజెపి - టీఆర్ఎస్  పార్టీల మ‌ధ్య‌నే పోటీ ఉంటుందని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.

Related Posts