న్యూఢిల్లీ, జనవరి 15,
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాపై ఈడీ విచారణకు హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మార్చిలో అరెస్ట్ అయిన 56 ఏళ్ల రాజకీయ నాయకుడిపై ప్రత్యేక మనీ లాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ (PMLA) కోర్టు ముందు ఫెడరల్ ఏజెన్సీ గత సంవత్సరం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ జరపడానికి అవసరమైన అనుమతిని హోంమంత్రిత్వ శాఖ ఇటీవల మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగానే కాకుండా ఆయన రాజకీయ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్‌గా కూడా నిందితుడిగా చేర్చారు. ఢిల్లీ ఎక్సైజ్ "స్కామ్"కి "ప్రధాన సూత్రధారి, కీలక కుట్రదారు" అని మాజీ ముఖ్యమంత్రిని ఈడీ అభివర్ణించింది. రాష్ట్ర మంత్రి, ఆప్ నాయకులు, ఇతరులతో కలిసి ఆయన పనిచేశారని ఆరోపించింది.ఆప్ ఒక రాజకీయ పార్టీ కాబట్టి, భారతదేశ పౌరుల సంఘం లేదా సంస్థగా నిర్వచించవచ్చని, అందువల్ల దీనిని PMLA సెక్షన్ 70లో పేర్కొన్నట్టుగా "కంపెనీ"గా వర్గీకరించవచ్చని ఈడీ గతంలో పేర్కొంది.‘నేరం జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఆప్‌కి బాధ్యత వహిస్తున్నందున, ఆయన, అలాగే ఆయన పార్టీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పేర్కొన్న నేరాలకు దోషులుగా పరిగణనలోకి వస్తారు. విచారణ, శిక్షకు గురవుతారు’ అని ఈడీ పేర్కొంది.2021-22 సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించినది ఈ ఎక్సైజ్ కేసు. తరువాత ఈ పాలసీని రద్దు చేశారు. ఆరోపణలపై CBI విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ V K సక్సేనా సిఫారసు చేశారు. తదనంతరం, ఈడీ PMLA కింద కేసు నమోదు చేసింది.2022 ఆగస్టు 17న నమోదు చేసిన సీబీఐ FIRను పరిగణనలోకి తీసుకుని, ఈడీ 2022 ఆగస్టు 22న ఆరోపణలను పరిశోధించడానికి మనీలాండరింగ్ కేసును దాఖలు చేసింది.