YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జూలై నుండి రేషన్ కార్డు ఫై 2 కెజి ల కంది పప్పు

జూలై నుండి రేషన్ కార్డు ఫై 2 కెజి ల కంది పప్పు

వచ్చే నెల నుంచి కార్డుదారులకు కందిపప్పు రెండు కేజీల చొప్పున పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. రాష్ట్రలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ డీలర్ల కోరిక ప్రకారం తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నియమించే అవకాశాలపై చర్చించారు. డిపోల ద్వారా సక్రమంగా నిర్దేశించిన సమయాల్లో సరుకుల పంపిణీకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రేషన్ షాపు డీలర్ల కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులను నామినీగా నియమించుకునే వెసులుబాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని  అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ షాపులను త్వరగా పూర్తి చేయాలన్నారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు త్వరితగతంగా విలేజ్ మాల్స్ ను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రన్న విలేజ్ మాల్స్ లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే నెల నుంచి కార్డుదారులందరికీ రెండు కేజీల కందిపప్పు అందించాలన్నారు. వేలిముద్రలు పడని వారికి అత్యంత సులభతరమైన పద్ధతి ద్వారా రేషన్ అందించేందుకు అనువైన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

Related Posts