ముంబై
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున అగంతకుడు సైఫ్ ఇంట్లో దూరాడు. అలికిడికి నిద్ర లేచిన సైఫ్ దుండగుడిని అడ్డుకోబోయాడు. దాంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగి సైఫ్ కు కత్తి పోట్లు తగిలాయి. నిందితుడు బాంద్ర పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం. సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు.