YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ కు కేంద్రీయ విద్యాలయం

నిజామాబాద్ కు కేంద్రీయ విద్యాలయం
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కృషి ఫలించింది. నిజామాబాద్ కు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. ఈ మేరకు సోమవారం  కేంద్రీయ విద్యాలయ సంఘట న్ ఉత్తర్వులు జారీచేసింది. మూడేళ్ల కిందటే బోధన్ కు కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా తాజాగా నిజామాబాద్ కు మంజూరు అయింది. 4ఏళ్లలో ఒకే జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కావడం విశేషం. ఎంపి కల్వకుంట్ల కవిత అప్పటి హెచ్ ఆర్డీ మంత్రి  స్మృతి ఇరానీ, ప్రస్తుత మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అవశ్యకతను తెల్పుతూ లేఖలు రాశారు. వ్యక్తిగతం గాను కలిసి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా ను విద్యారంగంలో ముందంజలో ఉంచేందుకు ఎంపి కవిత చేస్తున్న కృషి  పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Related Posts