YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్త పథకాలపై ఫీల్డ్ సర్వే...

కొత్త పథకాలపై ఫీల్డ్ సర్వే...

నిజామాబాద్, జనవరి 16, 
తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారుఈ డేటా ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. అనంతరం రిపబ్లిక్ డే జనవరి 26న పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అధికారులు కీలక సూచనలు ఇచ్చారు. వెరిఫికేషన్‌లో భాగంగా అధికారులు ఇండ్లకు సర్వే కోసం వస్తారని.. గ్రామ ప్రజలు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. గ్రామ కార్యదర్శి ద్వారా ప్రజలకు ఇప్పటికే సమాచారం తెలియజేశారు. నేటి నుంచి ఈనెల 20 వరకు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు.రైతు భరోసా పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.10 వేలు జమ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 12 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అందుకు సంబంధించిన కసరత్తు, విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రాష్ట్రంలో భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుండగా.. ఉపాధి హామీ పథకంలో చేసిన పని ఆధారంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. జనవరి 26న తొలి విడతగా రైతు కూలీల అకౌంట్లలో రూ.6 వేలు జమ చేయనున్నట్లు తెలిసింది.ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నారు. మెుత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షల సాయం అందిచనునన్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లను కేటాయించనున్నారు. తొలి దశలో నిరుపేదలకు అవకాశం ఇస్తామని సర్కార్ ప్రకటించింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయక చాలా ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 30 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

Related Posts