YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ పోరుబాట

బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ పోరుబాట

హైదరాబాద్, జనవరి 16, 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం ఏదైనా నదిపై ప్రాజెక్టు నిర్మించాలంటే పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలని అది ఇవ్వకుండానే ప్రాజెక్టు ప్రకటన చేశారని ఆగ్రహంతో ఉంది తెలంగాణ.బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య తాజా వివాదానికి కారణమయ్యేలా ఉంది. దీనిపై పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. నదుల అనసంధానం చేస్తామని ఇప్పటికే ప్రటించిన చంద్రబాబు ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించారు. తమను సంప్రదించకుండా ఇలా ప్రాజెక్టు ప్రకటించడంపై అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై కేంద్ర స్థాయిలో పోరాటానికి సిద్ధమైంది.  ఏపీ చేపట్టే నదుల అనుసంధాన ప్రాజెక్ట్ బనకచర్లపై అభ్యంతరం చెబుతూ కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి, గోదావ‌రి, కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుకు ఘాటైన లేఖ రాయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెబుతోంది... అనే వివరాలు తెలియజేస్తూ లేఖ‌లు రాయాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా, ఏ న‌దిపైనైనా ప్రాజెక్టు చేపడితే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీసహా పొరుగు రాష్ట్రానికి స‌మాచారం ఇవ్వాల‌ని ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం స్పష్టం చేస్తోందని అంటోంది తెలంగాణ. ఇదే విషయాన్ని లేఖలో రాయాలని నిర్ణయించారు.   నీటి పారుద‌ల శాఖ‌పై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి బనకచర్లపై అభ్యంతరం తెలియజేస్తూ లేఖ రాయాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కృష్ణా నదీ జ‌లాల విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తి వద్దని సూచించారు. ట్రైబ్లునల్స్‌లో గట్టి వాదనలు వినిపించాలని స్పష్టంచేశారు. ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ-1956 సెక్షన్ 3 ప్రకారం జలాలు కేటాయించేలా వాదించాలన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు వల్ల ముప్పు అంశంపై కూడా హైద‌రాబాద్ ఐఐటీతో చేయిస్తున్న స్టడీ విలైనంత త్వరగా పూర్తి చేయాలని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులు, వాటి అనుమతుల విషయంలో ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.  

Related Posts