YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కరీంనగర్‌ జనవరి 16
సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి   విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ఎక్కడికిపోయాయని ప్రశ్నించారు. హామీల అమలు ఎక్కడ అని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా, రైతుబీమా పథకాలు ఎక్కడ అని సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీశారు.అక్రమ కేసులతో కేటీఆర్‌ను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు ప్రపంచ దేశాలు పోటీపడతాయని చెప్పారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు రేసు నిర్వహణకు పోటీపడ్డాయి. కేటీఆర్‌ ఎంతో కష్టపడి హైదరాబాద్‌లో ఈ రేసును నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ పెంచితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి తుగ్లక్‌ పాలనను మరిపిస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా-ఈ రేస్‌ నిర్హహణతో టెస్లా వంటి ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొంగ కాబట్టి.. రేవంత్‌ అందరూ దొంగలే అనుకుంటున్నారని విమర్శించారు. అవినీతి అనేదే లేనప్పుడు ఈడీ కేసు ఎలా పెడుతుందన్నారు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావులను అరెస్టు చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని రేవంత్‌ చూస్తున్నారని ఆరోపించారు.సంజయ్‌ కుమార్‌ కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయాడని, అందుకే నీది ఏ పార్టీ అని అడిగానని చెప్పారు. మా బట్టలు విప్పుతామంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సంజయ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో లేకుంటే వార్డు మెంబర్‌గా కూడా గెలవడంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్‌ సమీక్ష సమావేశంలో మంత్రుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యేనైన తనను అంతా బెదిరించారని చెప్పారు. కరీంనగర్‌ ఆర్డీవో ఎవరో తనకు తెలియదని, ఆయన తనపై ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి గతంలో మంత్రి డీకే అరుణని తిట్టలేదా, జూపల్లి కృష్ణారావుని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆయనపై కేసు పెట్టారన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమారే తనపై దాడి చేశాడన్నారు. సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని అధికారుల సమక్షంలో చెప్పిన సంజయ్ కుమార్‌ను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్‌ చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసు, ల్యాండ్‌ గ్రాబింగ్ కేసులు లేవని, పీడీ యాక్ట్‌ ఎలా పెట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ పెట్టాలనుకుంటూ రేవంత్‌ రెడ్డితో మొదలు పెట్టాలన్నారు.13 నెలల్లో అక్రమ అరెస్టులు తప్ప రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. ఒక్క హామీ నెరవేర్చకుండా 13 నెలలుగా రేవంత్‌ సర్కార్‌ కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. అవినీతే లేని ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ చిల్లర చేష్టలతో బీఆర్‌ఎస్‌ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులపై మాట్లాడే స్థాయి మేడిపల్లి సత్యంకు లేదని విమర్శించారు.

Related Posts