YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు

మంత్రి పద్మారావు ఆకస్మిక తనిఖీలు

వర్షా కాలంలో సైతం  సికింద్రాబాద్ పరిధిలో ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బంది ఏర్పాట్లు జరపాలని రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ ఆదేశించారు. మంగళవారం అయన లాలాపేట, చంద్రబాబు నగర్, ఇందిరా నగర్, సిరిపురి కాలని తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక బస్తి సంఘాలు, కాలనీ సంఘాలతో ముఖ ముఖిలు నిర్వహించడం తో పాటు ఇంటింటికి  తిరిగి పద యాత్రలు జరిపి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలా పుడిక తీసివేత పనులను తనిఖి చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఏకరువు పెట్టిన వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులను పిలిపించి ఆదేశాలు జారి చేశారు. తార్నాక డివిజన్ కార్పోరేటర్  అలకుంట సరస్వతి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్ రవికుమార్, జల మండలి జనరల్ మేనేజర్ సుదర్శన్, ఈ ఈ ఇందిరా బాయి తో పటు విద్యుత్, రెవిన్యూ వంటి వివిధ విభాగాల అధికారులతో మంత్రి పర్యటన సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సైతం ప్రజలు ఇబ్బందులు పద కుండ నివారించేందుకు ఇప్పటికే వివిధ ఏర్పాట్లు జరిపామని, ఆయా చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయని మంత్రి పద్మారావు తెలిపారు. ఇందిరానగర్ ప్రాంతం వరద ముంపునకు గురి కాకుండా నివారించేలా అధికారులు చర్యలు తెసుకోవాలని ఆదేశించారు. నిదుల కొరతకు వెనకాడకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని సూచించారు. స్థానిక ప్రజల ఇబ్బందుల నివారణకు వెంటనే అన్ని విభాగాల అధికారులు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గడచిన నాలుగేళ్ళ స్వల్ప వ్యవధిలోనే 50 సంవత్సరాలుగా ఎదురైనా ఇబ్బందులని పరిష్కరించాగాలిగమని పద్మారావు గౌడ్ తెలిపారు. వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన ఏర్పాట్ల పై వెంటనే అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో తెరాస యువజన విభాగం నగర అధ్యక్షుడు అలకుంట హరి, తెరాస నేతల తో పటు స్థానిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Related Posts