హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసబ్ట్యాంక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్తో కలిసి కౌశిక్ రెడ్డి వెళ్లారు. ముందుగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అడ్వకేట్ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల జోక్యంతో న్యాయవాదికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు గంటపాటు కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం బయటకొచ్చిన కౌశిక్.. మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు పూర్తి సహకారం అందించానని చెప్పారు. గంట విచారణలో తనను 32 ప్రశ్నలు అడిగినట్లు ఆయన వెల్లడించారు