హైదరాబాద్
మాజీ మంత్రి, పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో నివాసం ఉంటున్న పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవితో కలిసి ఈనెల 10న సమీపం లోని టీటీడీ ఆలయానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. గుడి నుంచి వచ్చాక కాసేపటికి అరుణాదేవి బయటకు వెళ్లి మళ్ళీ సాయంత్రం వచ్చింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేచిన అరు ణాదేవికి బెడ్రూమ్ తలుపులు తెరిచి ఉన్న విషయం కనిపించింది. బెడ్రూమ్లోని అల్మారాలో ఉండాల్సిన రూ.1.5లక్షల నగదు, బంగారు గాజులు, నెక్లెస్లు, ఇతర ఆభరణాలు మాయమయినట్లు తేలింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం. గాలింపు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు