ముంబై
ముంబైలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడి ఫొటోను ముంబై నగర పోలీసులు విడుదల చేశారు. సైఫ్ నివసిస్తున్న అపార్ట్ మెంట్లోని సీసీ కెమెరాలో నమోదు అయిన అతడి పొటోను పోలీసులు విడుదల చేశారు. మరోవైపు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో దర్యాప్తు ను పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా తాజాగా సైఫ్ నివాసానికి సంబంధించిన సీసీ ఫు టేజ్ను విడుదల చేశారు. అందులో నిందితుడిని గుర్తించారు. సంబంధి త వీడియోలో నిందితుడు మెట్లు దిగుతూ కనిపించాడు. అవి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంకోవైపు సైఫ్ అలీఖాన్ పై దాడి నేపథ్యంలో ముంబై క్రైం బ్రాంచ్కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలుగా ఏర్ప డి కేసును దర్యాప్తు చేస్తు న్నారు. దీంతో సైఫ్ అలీఖాన్పై జరి గిన దాడిపై మొత్తం 15 బృందాలు విచారణ జరుపుతోన్నాయి.