అమలాపురం
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ఆంధ్రా గోవా బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హజరయ్యారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆనందరావు, బీచ్ లో ఆర్పాటు చేసిన సాండ్ బైక్ ను నడిపి సందడి చేసారు. కేరళ తరహా అందాలు ఉన్నా ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తిపు రాలేదనిమంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఎస్. యానం లో ఉన్న ఆంధ్రా గోవా బీచ్ ను పర్యాటక కేంద్రం గా అభివృధి చేసేందుకు పర్యాటక శాఖ అన్నివిధాల కృషిచేస్తుంది. కేరళ కంటే ఎక్కువ అందాలు కోనసీమలో ఉన్నా..కోనసీమకు ఇప్పటివరకు సరైన గుర్తిపు రాలేదు..కోనసీమను టూరిజం, టెంపుల్ టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వంలో అయిదు సంవ్సరాలు పర్యాటకం పూర్తిగా కుంటుపడింది. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పీఎం మోడి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు.