తిరుమల, జనవరి 21,
అధికారాన్ని సమర్థంగా వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సర్కారుకి వ్యతిరేకంగా అనవసర ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ నేతలు ఖండించలేక పోతుండటం కూటమి శ్రేణులకు మింగుడు పడటం లేదంట. తిరుమల వ్యవహారాలకు సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శలను కూటమి శ్రేణులు ఖండించ లేక పోతున్నాయి. దాంతో ప్రతి చిన్న విషయంపై రాద్దాంతం చేస్తున్న వైసీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు గుప్పిస్తుంది.టీటీడీ పాలక్కవర్గం ఏర్పడిన అరు నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం లో అనేక మార్పులు వచ్చాయి. సామాన్యుడి స్వామి దర్శనానికి పెద్ద పీట వేసారు. అదే సమయంలో వీఐపీల బ్రేక్ దర్శనాలు తగ్గించారు. మరో వైపు అన్నదానంలో మార్పులు తెచ్చారు. నాణ్యత కలిగిన భోజనాన్ని భక్తులకు పెడుతున్నారు. లడ్డూ ప్రసాద క్వాలీటి పెంచారు. సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో కేవలం వీఐపీలకు మాత్రమే పెట్టే ప్రసాదాలను సామాన్యుడి వరకు తెచ్చారు. మరో వైపు దశాబ్దాల కాలంగా ఉన్న చెత్త సమస్యపై సీరియస్‌గా స్పందించారు. పాతుకుపోయిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. బ్రహోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. గరుడ సేవ నాడు ఏకంగా మూడు లక్షల మంది భక్తులకు మాడ వీధులలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు.అయితే ముగ్గురు అధికారుల నిర్ల్యక్షానికి వీరు అరు నెలలుగా పడిన కష్టం వృథా అయింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకన్ల ఇష్యూ సందర్భంగా రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అరుగురు మరణించారు. ఈ ఘటనలో వైఫల్యం క్యూలైన్ సెంటర్ల నిర్వహాణ బాధ్యతలు చూసిన టీటీడీ జేఈఓ అయిన ఐఏఎస్ గౌతమిరెడ్డితో పాటు అక్కడ టీటీడీ ఇన్ చార్జ్ గా ఉన్న డాక్టర్ హారినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ్ కూమార్ నిర్లక్ష్యం అడుగడుగనా కనిపించింది. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎస్పీ సుబ్బారాయుడు, సీవీ అండ్ ఎస్ఓగా ఉన్న శ్రీధర్ పై బదిలీ వేటు వేశారు.మరో వైపు గతంలో లేని విధంగా ఇప్పుడు తిరుమల ప్రాంతాలలో నిరంతరం రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్.. అటవీ శాఖలు సంయుక్తంగా రెగ్యులర్ గా కూబింగ్ నిర్వహిస్తుండటంతో పెద్ద ఎత్తున స్మగ్లర్లు బయటపడుతున్నారు..గతంలో లేని విధంగా తనిఖీ లు నిర్వహించడం వల్లనే ఇది జరుగుతుందని అంటున్నారు. గతంలో తిరుమలలో పలుమార్లు గంజాయితో పాటు మాంసం, మద్యం పట్టుబడ్డాయి. అయితే వీటిపై అరోజు ఎవ్వరు మాట్లాడిన వారిపై ఎదో ఓక రంగంగా ప్రతీకార చర్యలు తీర్చుకున్నారు. కేసులు పెట్టి వేధించారు. మీడియాను సైతం కంట్రోల్ చేయాలని చూశారుచిరుత పులి దాడి విషయంలో జరిగింది కూడా అందరికీ తెలుసు.. క్యూలైన్లలోని భక్తులకు కనీసం అన్న ప్రసాదం కూడా పంపిణీ చేయలేదనే విమర్శలున్నాయి. కరోనా తర్వాత టోకెన్ లేనిదే తిరుమలలోకి ప్రవేశం లేకుండా పోయింది. గోవింద రాజ సత్రాల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు గాయపడిన తర్వాతనే సర్వ దర్శనానికి అనుమతి ఇచ్చారు. పులి పేరుతో కాలినడకన అలిపిరి మార్గాన వెళ్ళే భక్తులకు టోకెన్స్ అపేసారు. ఇక లడ్డూ రేట్లు పెంచి, క్వాలీటి తగ్గించారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనను వైసీపీ ఆయుధంగా మలుచుకోవాలని చూసింది. లడ్డూ కౌంటర్ లో షార్ట్యూ సర్కూట్ వల్ల ప్రమాదం అన్నది మాములు వ్యవహారం. దానిపై కూడా వైసీపీ హడావుడి చేసింది. గతంలో వైసీపీ హయాంలోనే లడ్డూ కౌంటర్ల లో సిస్టమ్స్ అపరేషన్ ప్రారంభమైంది. అందుకు సంబంధించి అప్పట్లో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఉన్నారు. అయితే వీటిన్నంటి విషయంలో కూటమి నేతలు మౌనంగా మాట్లాడకుండా ఉన్నారు. జిల్లాలో 13మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంఎల్ సిలు, కార్పొరేషన్ చైర్మన్లు, మరో వైపు ముగ్గురు పార్లమెంటు అధ్యక్షులు, అధికార ప్రతినిధులు ఉన్నారు.ఇంతమంది ఉన్నప్పటికీ వై ఎవ్వరు కనీసం నోరు తెరవడం లేదు.. మాట్లాడితే తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ తప్ప మిగతా వారెవ్వరూ వైసీపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం లేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రతి రోజు ఏదో ఒక హాడావుడి చేస్తూ అటు కూటమి ప్రభుత్వం, ఇటు టీటీడీ బోర్డుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. తమ మీడియాతో పాటు అనుబంధ మీడియా, ఇతర గ్రూపులలో పెద్ద ఎత్తున సోషియల్ మీడియాలో కొండపై పాపాలు జరిగిపోతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.వైసీపీ విమర్శలు చేస్తున్నా కూటమి నాయకులు పట్టుపట్టనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి టీడీపీ నేతలు అయితే తమకు పదవులు లేవు.. కనీసం గుర్తింపు కూడా లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటున్నారంట. ఎమ్మెల్యేలు కూడా ఎవరూ నోరు విప్పడం లేదు. సీనియర్ నేత అమర్‌నాథ్ రెడ్డి సైతం మౌనంగానే ఉంటున్నారు. విపక్షం విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సిన కూటమి నేతలంతా మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటం మిత్రపక్షాల కేడర్‌కు మింగుడుపడటం లేదంట. ఇది ఇలాగే కొనసాగితే కార్యకర్తలలో అత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని ముఖ్యంగా తిరుపతి లాంటి కీలకమైన చోట పార్టీ కి దిక్కూ దివాణం లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.