రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసును మహారాష్ట్రలోని భీవండి కోర్టు ఆగష్టు 10కి వాయిదా వేసింది. న్యాయస్థానంలో హాజరు కావడం కోసం రాహుల్ గాంధీ ముంబై మీదుగా భీవండీ చేరుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మహాత్మా గాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందంటూ రాహుల్ విమర్శలు చేశారు. 2014 మార్చి 6న భీవండిలోని ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ ఈ విమర్శలు చేయగా.. ఆర్ఎస్ఎస్ తిప్పికొట్టింది. రాజేష్ కుంతే అనే సంఘ్ కార్యకర్త ఫిర్యాదు మేరకు ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. నాలుగేళ్ల ఈ కేసు కొనసాగుతోంది. ఈ కేసు విషయంలో రాహుల్ తొలుత వెనక్కి తగ్గారు. ఆర్ఎస్ఎస్‌పై తాను విమర్శలు చేయలేదని, ఆరెస్సెస్ కార్యకర్తలను మాత్రమే విమర్శించానని రాహుల్ చెప్పారు. ఇందుకు సంబంధించి అఫిడవిట్‌ను కూడా కోర్టులో సమర్పించారు. తర్వాత ఆయన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారు. కానీ తర్వాత ఆర్ఎస్‌ఎస్‌పై పోరాటానికే ఆయన మొగ్గు చూపారు.