తిరుమల
పది రోజులపాటు తిరుమలలో జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. సోమవారం వేకువజాము నుంచి సాధారణ దర్శనాలు మొదలయ్యాయి. కాగా, పది రోజుల్లో 6,83,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. హుండీ ద్వారా రూ.34.43 కోట్ల ఆదాయం లభించింది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ అత్యధికంగా 78 వేల మంది శ్రీవారిని దర్శించుకోగా, రెండవరోజు ద్వాదశి రోజున అతితక్కువగా 53,013 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, పెరిగిన రద్దీ నేపథ్యంలో సోమవారం దర్శనానికి సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో టోకెన్రహిత దర్శనాలు జరిగాయి.