హైదరాబాద్
మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా చాక్లెట్లను తయారు చేయడం అభినందనీయమని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని దసపల్ల హోటల్ లో హెటాఫీ డైమండ్ క్యాండి నీ ఆయన ప్రముఖ వైద్యురాలు పద్మశ్రీ మంజుల అనగాని తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో ఆరోగ్యాలను పాడుచేసే, చెడగొట్టే ఆహార పదార్థాలు తయారవుతున్నాయని అలాంటివి కాకుండా ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే చాక్లెట్లను ఆరోగ్యాలను పాడు చేసే విధంగా కాకుండా మెరుగుపరిచే విధంగా తయారు చేయడం నిజంగా అభినందనీయం అన్నారు. హెటాఫీ క్యాండీ అధినేత ఎస్. సృజన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ప్రపంచ స్థాయి చాక్లెట్ లను దేశం మొత్తం అందించేందుకు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. కాన్ఫెక్షనరీ రంగంలో స్వదేశీ ఉత్పాదనగా ఇప్పటికే హెటాఫీ క్యాండీ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ క్యాండీ పై క్లినికల్ ట్రయల్స్ జరిగి యూఎస్ఏ నుంచి ఎఫ్డియే అప్రూవల్ కూడా పొందిందని తెలిపారు.
ప్రతిరోజు ఓ క్యాండీ తినే వాళ్ళకి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ వంటి సమస్యలు తొలగిపోతాయని అన్నారు.