విజయనగరం
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి విజయనగరం ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్,ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ నాయకులు హజరయ్యారు.
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు. గత ప్రభుత్వంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. గత పాలనలో సమస్యలపై విరోచితంగా పోరాటం చేసాం. గత ఐదు సంవత్సరాలు నిరంకుశ పాలన జరిగింది. ప్రతీ నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టిడిపి నాయకులకు,కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థలను నాశనం చేసారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన జరుగుతుంది. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. త్వరలో విజయనగరం జిల్లా టిడిపి పార్టీ కార్యాలయం నిర్మాణం జరగబోతుంది. విజయనగరం వెనుకబడిన జిల్లా అనే పదాన్ని తీసేయండి. ఈ జిల్లాలో అనేక సహజ వనరులు ఉన్నాయి. అభివృద్ధి జరుగుతున్న జిల్లాగా మార్చుదాం. చంద్రబాబు నాయుడు చేతులు మీదగా శంకుస్థాపన జరిగితే-ఆయన చేతుల మీదగానే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు ఎక్కువుగా చేసిన వారిని సభలో సత్కరించారు.