YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి

భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి

దావోస్:
అన్నివిధాల అనుకూలతలు కలిగిన భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి మిట్టల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ లోని బెల్వేడార్ లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.... పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతం. ప్రణాళికాబద్ధమైన 83.3 MTPA సామర్థ్యం గల పోర్టు, వైజాగ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ కొలువై ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వం మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయి. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉంది. హెచ్ పిసిఎల్ – మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ  HMEL - HPCL-మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్  ఆధ్వర్యాన రూ.3,500 కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఎపిలో ఏర్పాటు చేయండి. ఈ ప్రాజెక్ట్ ను ఏపీలో ఏర్పాటుచేసేందుకు ఎపిఈడిబి అధికారులతో కలసి సైట్ ను సందర్శించండి. 2వేలమందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ... ఆర్సెలర్ మిట్టల్, జపాన్ కు చెందిన నిప్పాన్ స్టీల్ జెవి సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాం. AM/NS ఇండియా పేరుతో జాయింట్ వెంచర్ అనకాపల్లి జిల్లా సమీపంలో 2 దశల్లో ₹1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ... ఇందుకు సంబంధించి ఎపి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ 26-11-2024న GO విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు లక్ష్మీమిట్టల్ కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మిట్టల్ మాట్లాడుతూ....  గ్రీన్‌కో వారి హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఉపయోగించి 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్సెలార్ మిట్టల్ భారతదేశంలోని గ్రీన్‌కో గ్రూప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు అనకాపల్లిలో  AM/NS ఇండియా కొత్తగా ఏర్పాటుచేసే స్టీ ల్ ప్లాంట్ కు 250 MW నిరంతరాయ పునరుత్పాదక విద్యుత్ ను సరఫరా చేస్తుంది.  దీనివల్ల ప్రతిఏటా కార్బన్ ఉద్గారాలను 1.5 మిలియన్ టన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. సుస్థిరమైన, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధాన్యతను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఏర్పాటు చేయనున్న 1 MT గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కోసం AM గ్రీన్ తన పెట్టుబడిని దృఢపరిచిందని మిట్టల్ తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని అన్నారు. ఈ భేటీలో లక్ష్మీమిట్టల్ కుమార్ ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఎపి ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

Related Posts