నౌపాడ (ఒడిషా)
ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్ ఘడ్, ఒఢిషా రాష్ట్రాల సరిహద్దుల్లోని కులరిఘాట్ ఆడవిలో మావోయిస్టుల సంచారం పై పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఇరు రాష్ట్రాల బలగాలు, సీఆర్పిపిఎఫ్ దళాలు నౌపాడ, గరియాగంజ్ ఆటవీ ప్రాంతాల్లో కుంబింగ్ ప్రారంభించాయి. సోమవారం నాడు ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. అక్కడే భారీ ఎత్తున ఆయుధాలు, ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్న తరుణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులు తరసపడ్డారు. అప్పుడు జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరగవచ్చని సమాచారం. ఈ నెల లో ఇప్పటివరకు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఉమ్మడి ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది ఎన్‌కౌంటర్‌లో కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు కూడా గాయపడినట్లు సమాచారం. ఒరిస్సా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు అధికారులు ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.