న్యూఢిల్లీ
ఒడిశా-ఛత్తీస్ గఢ్ బోర్డర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 14 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు హతమయ్యారు. దీంతో, మొత్తం 16 మంది మావోలు చనిపోయినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది గాలింపు జరుపుతున్నారు. మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉండొచ్చని అధికారులు చెపుతున్నారు.
మరోవైపు ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ... మావోయిస్టులు లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు అని చెప్పారు. మన భద్రతాబలగాలకు ఇదొక గొప్ప విజయమని అన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని చెప్పారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ కు చెందిన బలగాలు, సీఆర్పీఎఫ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని తెలిపారు. దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని అన్నారు.