హైదరాబాద్
మోండా మార్కెట్, రాంగోపాల్ పేట, బేగంపేట డివిజన్ లలో ఫుట్ పాత్ వ్యాపారులతో న ఎమ్మెల్యే,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. నిర్ధేశించిన స్ధలాల్లో నే వ్యాపారాలు జరుపుకోవాలని,రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ కు, ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఫుట్ పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలని అన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.