YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భావి ప్రధాని గా లోకేష్... ఎమ్మెల్యే వేగుళ్ళ..

భావి ప్రధాని గా లోకేష్...  ఎమ్మెల్యే వేగుళ్ళ..

మండపేట
దేశం గర్వించదగ్గ నాయకత్వ పటిమ ఉన్న మంత్రి నారా లోకేష్ భావితరాల ప్రధాని కావాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు  పేర్కొన్నారు.
యువ నాయకులు మంత్రి నారా లోకేష్  జన్మదిన వేడుకలను మండపేట పట్టణ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు  ఆధ్వర్యంలో నిర్వహించారు.  వేగుళ్ళ జోగేశ్వరరావు  సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనాయకుడు అంటే లోకేష్ లా ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నారా లోకేష్ ను లక్ష్యం గా  చేసి ఎన్ని ముప్పుతిప్పలు పెట్టారో అందరికి తెలుసునన్నారు. అయినప్పటికీ అన్ని ఆటుపోట్లను తట్టుకుని యువగళం పాదయాత్రతో తన సత్తాని చాటిచెప్పిన వ్యక్తి లోకేష్ అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరూ నడవాలన్నారు.  కోటి సభ్యత్వాలు దాటి అంతర్జాతీయంగా ఎవరు సాధించని రికార్డు సాధించి అందరి చూపు రాష్ట్రం వైపు చూసేలా చేశారంటే అది ఆయనకున్న పటిమకి నిదర్శనం అన్నారు. లోకేష్  భారతదేశానికే బావి ప్రధానిగా రూపుదిద్దుకోవాలని  ఎమ్మెల్యే అన్నారు. లోకేష్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని  తెలిపారు. కేక్ కట్ చేసి లోకేష్  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, వాకచర్ల గుప్తా, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాంబాబు, రాష్ట్ర ఎస్.సి కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, ఆయా వార్డు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts