గన్నవరం
గన్నవరం టీడీపీ క్యాంప్ కార్యాలయం లో టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 42వ జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, 2 కేజీ ల భారీ కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జీవిత కాలం సభ్యత్వం నమోదు చేసుకున్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో మొదటి స్థానం నిలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. క్రీస్తు పూర్వం క్రీస్తుశకం లాగా యువగళం ముందు.. యువగళం తర్వాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగింది. వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. లోకేష్ పాదయాత్ర గన్నవరం చేరుకున్నప్పుడు ఆయన సమక్షం లో టీడీపీ లో జాయిన్ అయ్యాను. పుట్టిన రోజున కూడా దావోస్ లో రాష్ట్రం కోసం పర్యటిస్తున్నారు. ఆయనకు హృదయ పూర్వక శుభాకాంక్షలని అన్నారు.
రాష్ట్ర దశ దిశా మార్చేందుకు కృషి చేస్తూ ఆ దిశా గా లోకేష్ బాబు పని చేస్తున్నారు. 28 న అమర్ రాజ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబోతున్నాం. మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గన్నవరం అభివృద్ధి నా అజెండా. గత పాలకుల పాలన ప్రజలకు శాపం గా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం లో రెండవ స్థానం లో గన్నవరం ఉంది, మొదటి స్థానం దక్కేలా మరింతగా శ్రమిస్తానని అన్నారు.