మంథని
తెలంగాణ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ( సిఐటియు), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్( ఐఎన్టియుసి) పిలుపు మేరకు మంథని బస్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు జేబులకు పలు డిమాండ్లతో కూడిన బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల పథకంలో సవరణలు చేయాలని,ఆర్టీసీలే నేరుగా విద్యుత్ బస్సులు కొని నడిపేలా విధానంలో సవరణ చేసి నిధులు సమకూర్చాలని అన్నారు.కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీ ఇన్సెంటివ్ లు ఆర్టీసీలకు ఇవ్వాలని, ప్రజల అవసరాల మేరకు బస్సులు పెంచాలన్నారు.హరితహారం, నేషనల్ క్లీన్ ఎయిర్ పోగ్రామ్ కింద నిధులు ఇవ్వాలని, మోటార్ వెహికల్ ఆక్ట్ -2019 లో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు విధులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మంథని డివిజన్ అధ్యక్షుడు బూడిద గణేశ్, మంథని ఎస్ బ్ల్యూ ఎఫ్ డిపో కార్యదర్శి రాపెల్లి రాజయ్య, శ్రీనివాస్, సాగర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.