YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవంబర్ నాటికి పూర్తి కానున్న బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్

 నవంబర్ నాటికి పూర్తి కానున్న బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్

ఇప్పటివరకు నలభై శాతం పైగా పనులను పూర్తి చేసుకున్న బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ రానున్న నవంబర్ నెల నాటికి ముగించటానికి వీలుగా నిర్దేశించుకున్న రోడ్డు మ్యాప్ ప్రకారం సమాంతరంగా నాలుగు ప్రధాన పనులు జరగతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనుల కంటే ఇక మీదట పనులు వేగంగా జరగనున్నాయి. ప్రధానంగా వయాడక్ట్ నిర్మాణానికి సంబంధించి గడ్డర్ల ఏర్పాటు, బ్యాలెన్స్ పిల్లర్ల నిర్మాణం, అప్రోచ్ పనులు, బెంజిసర్కిల్ దగ్గర పిల్లర్ల ఏర్పాటు వంటి పనులు మొదలయ్యాయి. ఫ్లై ఓవర్‌ పిల్లర్లకు అనుసంధానంగా కీలకమైన వయాడక్ట్‌ నిర్మాణంలో భాగంగా గడ్డర్ల పనులను అర్ధరాత్రి కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. ఇప్పటికి నాలుగు గడ్డర్లను అమర్చారు. ప్రతిరోజూ రెండు గడ్డర్ల చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు భారీ క్రేన్లతో అర్థరాత్రి సమయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా గడ్డర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో తెల్లవారుఝామున చూసే సరికి కొత్తగా కనిపిస్తోంది. ఎస్‌వీఎస్‌ కళ్యాణమండపం దగ్గర పీ1-పీ2 పిల్లర్ల పై ప్రస్తుతం గడ్డర్ల ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి వరుసగా రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు పిల్లర్ల మీద క్రమంగా గడ్డర్లను ఏర్పాటు చేసుకుంటూ వెళతారు. పెనమలూరులోని క్యాస్టింగ్‌ డిపో నుంచి నిర్దేశించుకున్న రూట్‌ ప్లాన్‌ ప్రకారం ట్రాలీలపై గడ్డర్లను బెంజిసర్కిల్‌కు తీసుకు వస్తున్నారు. రాత్రి 11గంటల ప్రాంతంలో ట్రాఫిక్‌ను హైవే ఒక వైపుకు పరిమితం చేస్తున్నారు. హైవేను వన్‌వే చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగలేదు. అర్ధరాత్రి తర్వాత 1-3 గంటల మధ్యన గడ్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. బెంజిసర్కిల్‌ నిర్మాణానికి సంబంధించి మొత్తం 240 గడ్డర్లను అమర్చాల్సి ఉంది.బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి మొత్తం 49పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి మొత్తం 30 పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఇంకా 19 పిల్లర్లు వివిధ దశలలో ఉన్నాయి. జూలై నెలాఖరుకు ఇవి పూర్తవుతాయి. బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ అప్రోచ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎస్వీఎస్ జంక్షన్ దగ్గర, రమేష్ హాస్పిటల్స్ దాటిన తర్వాత రెండు అప్రోచ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండు చోట్ల అప్రోచ్ లను వేయటానికి నేల చదును జరిగింది. అప్రోచ్ పనులను ముందుగా ఎస్వీఎస్ జంక్షన్ నుంచి ప్రారంభించారు. బెంజిసర్కిల్ దగ్గర 9, 10 పిల్లర్లను ఏర్పాటు చేయటానికి ప్రత్యేకంగా బ్యారికేడింగ్ చేపట్టనున్నారు. బ్యారికేడింగ్ ఏర్పాటుకు ఎన్ హెచ్, పోలీసు ఉన్నతాధికారులు జాయింట్గా పరిశీలించారు. రెండు రోజుల్లో బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి పిల్లర్ల పనులు ప్రారంభిస్తారు.

Related Posts