హైదరాబాద్
హుస్సేన్ సాగర్ లో బోట్లకు మంటలు వ్యాపించిన ఘటనలో గాయపడిన వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజిపి నాయకులు సోమవారం ఉదయం పరామర్శించారు. ఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. మరోకరి పరిస్థితి విషమంగా వుంది.
కేంద్ర మంత్రి హారతి ఇస్తున్న టైములో పాటకాలను పేల్చడానికి సిబ్బంది చేసారు. రెండు బోట్లలలో పటాకులు పెల్చుతుండగా నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. దాంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. గాయాలు అయిన కొంతమంది ని యశోద హాస్పిటల్ కి మరికొంత మందిని గాంధీ హాస్పిటల్ కి, సరోజినీ హాస్పిటల్ కి తరలించారు. తూర్పు గోదావరి కి చెందిన గణపతికి తీవ్ర గాయాలయ్యాయి. గణపతి శరీరం 80 శాతం కాలిపోయినట్లు వైద్యలు చెప్తున్నారు. అంబర్పేట్ కి చెందిన చింతల కృష్ణ, హుజరాబాద్కు చెందిన సాయికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరి కొంత మందికి ఐదు నుంచి పది శాతం శరీరం కాలినట్లు సమాచారం. ముగ్గురి కండల్లో నిప్పు రవ్వలు పడటంతో మెహది పట్నంలోని సరోజినీ దేవి ఆసుపత్రిలో లో చికిత్స అందిస్తున్నారు