YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్కడ పేషంట్ కేర్ సిబ్బందే వైద్యులు

అక్కడ పేషంట్ కేర్ సిబ్బందే వైద్యులు

మహబూబాబాద్ జిల్లా  గూడూరు మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్ కేర్ వైద్యులుగా మారి వైనం వెలుగులోకి వచ్చింది.  క్రిమిసంహారక మందు సేవించి వచ్చిన రోగికి పేషంట్ కేర్ వైద్యం చేసిన సంఘటన తీవ్ర స్థాయిలో మండి పండారు స్థానికులు.
గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన తుర్రేం సునీల్ (29) కుటుంబ ఆర్థిక భారంతో పురుగుల మందు సేవించారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆస్పత్రికి రాగానే డ్యూటీలో ఉండవలసిన వైద్యురాలు నవత డ్యూటీలో లేకపోవడంతో పేషెంట్ కేర్ మరియు నర్సు ఇద్దరూ కలిసి వైద్యం చేసిన సంఘటన చోటుచేసుకుంది.
ప్రాణాలు కాపాడమని ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడం మా యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రోగి బంధువులు ఆరోపించారు..
వీధుల్లో ఉండవలసిన డాక్టర్ నర్సంపేట నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు డిమాండ్ చేశారు...

Related Posts