జనగామ
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. కడియం శ్రీహరి అంతు చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పదిమంది కుక్కిన పేనులా ఉంటే. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ లో ఉడకవు. పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైంది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. బట్టి విక్రమార్క సతీమణి సైతం..వసూళ్లు కొనసాగిస్తుంది. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలై.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు.