YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాలీవుడ్ హీరో అర్మాన్ కోహ్లీ అరెస్ట్!

బాలీవుడ్  హీరో  అర్మాన్ కోహ్లీ అరెస్ట్!

 బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన సహజీవన భాగస్వామి, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసి, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

Related Posts