YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసు పెట్టాలి

సిఎం రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసు పెట్టాలి

రంగారెడ్డి
రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసు లో అసలు నిజాలు పక్క దారి పడుతున్నాయి. కేటీఆర్ పై లేని పోని కేసులు పెడుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు లో ఏసిబి, ఈడీ విచారణ చేసి ఏం తేల్చలేదు. ఫార్ములా ఈ కార్ రేసు లో ఏలాంటి అవినీతి జరగలేదు. రేవంత్ రెడ్డి అనురాగం తన బందువులపై చూపిస్తున్నాడు. అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి తన బందువులకు టెండర్లు ఇప్పించుకుంటున్నాడు. కైట్ ఫెస్టివల్, పెట్టీ ప్రభుత్వ సొమ్ము  దుర్వినియోగం చేశారు. కేటీఆర్, పై కాదు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి.  సెక్షన్ 316 ప్రకారం సియం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని అన్నారు.

Related Posts