YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి..?

ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి..?

న్యూఢిల్లీ,
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబో తున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎగ్జిట్  పోల్ తన అంచనాలను ప్రకటించింది.
ఇందులో ఈసారి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో ఆప్ ఆధిప త్యానికి గండి కొట్టబోతున్నట్లు తెలిపింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించు కోబోతున్నట్లు తెలిపింది.
అలాగే అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించబో తున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీ వున్న ఆప్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోరు సాగింది. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ వరుసగా నాలుగోసారి డిల్లీలో అధికారం దక్కించు కునేందుకు శ్రమించారు.
అయితే కేంద్రంలో మూడో సారి గెలిచినా ఢిల్లీని గెలవలేకపోతు న్నారన్న అపప్రదను పోగొట్టు కునేందుకు బీజేపీ నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపుతెచ్చాయి.

Related Posts