YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కార్ లాంచ్

మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కార్ లాంచ్

అద్భుతమైన 500 ప్లస్ మైలేజ్ రేంజ్ తో తమ మొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ విటారాను లాంచ్ చేసిన మారుతి సుజుకి. బంజారా హిల్స్ నెక్స షో రూమ్ లో మారుతి కమర్షియల్ బిజినెస్ హెడ్ వినీత్ జైన్, రీజినల్ మేనేజర్ అమిత్ కుమార్ తో కలిసి తమ మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు మారుతీ లో కేవలం పెట్రోల్ సిఎన్జి వాహనాలు ఉండటమే అందరికీ తెలుసు కానీ తమ కస్టమర్ల ఆకాంక్ష మేరకు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న తమ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారాను రెండు వేరియేషన్స్ తో 500 ప్లస్ మైలేజ్ తో మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈనెల భారత మొబిలిటీ ఎక్స్ పోలో ఢిల్లీ వేదికగా ఈ కారు లాంచ్ చేసామని అన్నారు. ఈరోజు హైదరాబాదులో ఈ కార్ ను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా మారుతికి ఉన్న అతి పెద్ద నెట్వర్క్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, మెయింటెనెన్స్ విషయంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము సేవలు అందించనున్నామని అన్నారు. మారుతి అంటేనే అతి తక్కువ మెయింటెనెన్స్ తో నడిచే వాహనాలు అని ఇప్పటికే తమ కస్టమర్లలో మంచి పేరు ఉన్న కారణంగా ఇప్పటికే బుకింగ్స్ అధిక సంఖ్యలో వస్తున్నాయని ఈ ఎలక్ట్రిక్ వాహనాలు బుకింగ్ చేసుకునే కష్టమర్లు ఏప్రిల్ మొదటి వారం నుండి వారికి వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ సందర్భంగా ప్రముఖ క్యాబ్ సంస్థ మొట్టమొదటిగా 28 వాహనాలు బుకింగ్ చేయడం జరిగింది అని వాటిని ఈరోజు విజయవంతంగా వారికి డెలివరీ కూడా చేస్తున్నట్టు తెలిపారు.

Related Posts