YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విడుదలకు సిద్ధమవుతోన్న హారర్ మూవీ మిస్టర్ హోమానంద్

విడుదలకు సిద్ధమవుతోన్న హారర్ మూవీ మిస్టర్ హోమానంద్
ఈ వారం కొత్త సినిమాల సందడి నెలకొంది. యంగ్ టాలెంట్ తో దూసుకువస్తున్నవారు కొందరైతే... డబ్బింగ్ చిత్రాలు సైతం తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగునాట యంగ్ టాలెంట్ కు ఎనలేని ఆదరణ లభిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వాలే కానీ, యువ నటీనటులు తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా... మిస్టర్ హోమానంద్ మూవీ కూడా ఈ కోవలోకే చేరుతుంది. జైరామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హోమానంద్, పావని జంటగా నటించారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. మరోవైపు... కోలీవుడ్ కామెడీ స్టార్ సంతానం హీరోగా నటించిన దిల్లుకు దుడ్డు మూవీ తెలుగులో దమ్ముంటే సొమ్మేరా పేరిట విడుదలకు సిద్ధమవుతోంది. రంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట విజయఢంకా మోగించింది. తెలుగులోనూ సంతానానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో దీన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలియజేశారు. మరి.. తమిళ తంబిలను అలరించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి. 

Related Posts