YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బరిలో ఉంటామన్న కడియం శ్రీహరి

బరిలో ఉంటామన్న కడియం శ్రీహరి

వరంగల్ , ఫిబ్రవరి 10,
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినప్పటికీ శిరసా వహిస్తానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.కొద్దిరోజులుగా తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని భారత రాష్ట్ర సమితి హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతోంది. కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని.. ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని చెబుతోంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ పట్టుదలని విక్రమార్కుడి లాగా న్యాయస్థానాలలో పోరాటాలు చేస్తున్నారు.కానీ అదే తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. 36 మంది ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలోకి రెండు పర్యాయాలు ఎందుకు ఆహ్వానించారో మాత్రం కేటీఆర్ చెప్పడు. పైగా దానిని ప్రజాస్వామ్య విజయంగా చెబుతుంటాడు. 36 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడానికి నాడు భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ రాజకీయ పునరేకీకరణగా అభివర్ణించారు. అంతేకాదు అది రాజకీయాలలో గుణాత్మకమైన మార్పుకు నాంది పలికిందని జబ్బలు చేర్చుకున్నారు. పైగా ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు కాపాడుకోవాలని.. మా విధానాలు నచ్చి వారు మా పార్టీలో చేరితే మేము ఎందుకు వద్దంటామని కెసిఆర్ సుభాషితాలు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నారు. భారీగా డబ్బు ఖర్చుపెట్టి కోర్టులలో కేసులు వేసి.. ప్రజాస్వామ్య సూత్రాల గురించి వల్లిస్తున్నారు. అదేంటో అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రజాస్వామ్య ధోరణిలో వెళ్తుంది. అదే అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించిందో ఆ పార్టీ పెద్దలు మర్చిపోయారు కాబోలు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీ వెళ్ళినప్పుడు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటువేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు..పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినప్పటికీ శిరసా వహిస్తానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వచ్చిన ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. పారిపోయే పరిస్థితి అసలే లేదని తేల్చి చెప్పారు. ఫిరాయింపులపై మాట్లాడే అవకాశం భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎక్కడిదని ఆయన అన్నారు.. గడచిన పది సంవత్సరాలలో 36 మంది ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితి లోకి చేర్చుకొని.. మంత్రులను చేసిన ఘనత ఎవరిదని ప్రశ్నించారు..” ప్రజాస్వామ్య విలువల గురించి భారత రాష్ట్ర సమితి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ భయపడేది లేదు. నేను ప్రజల మనిషిని. ప్రజల్లో ఉన్న మనిషిని. ఎన్నికలను కచ్చితంగా ఎదుర్కొంటాను. కచ్చితంగా ప్రజల మెప్పు మరోసారి పొందుతాను. అందులో అనుమానం లేదు. నేను ప్రజలలో నుంచి వచ్చిన నాయకుడిని. రబ్బర్ స్టాంప్ నాయకుడిని కాదు.. నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఎన్నో పదవులు అనుభవించాను. అన్నింటికీ న్యాయం చేశాను. ఇప్పుడు కూడా నన్ను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేస్తూనే ఉన్నాను. ఇలాంటి ప్రతి ఘటనలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటానని” కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు భారత రాష్ట్రపతి వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించింది. అయితే దానిని తప్పుపడుతూ కడియం కావ్య.. తాను భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయలేనని.. ఆ పార్టీలో ఉండలేనని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలో తాను కొనసాగలేనని కేసీఆర్ కు లేఖ రాసింది. అంతేకాదు వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించింది..

Related Posts