YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రంగరాజన్ ను పరామర్శించిన కేటీఆర్

రంగరాజన్ ను పరామర్శించిన కేటీఆర్

రంగారెడ్డి
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి మరియు ఇతర నేతలు పరామర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది.. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ గారి కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related Posts