
హైదరాబాద్, ఫిబ్రవరి 11,
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్టోరీ క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి..కాంగ్రెస్ గూటికి చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తోంది కారు పార్టీ. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో వరుస విచారణలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ టైమ్ కావాలంటూ గడువు కోరడంతో ఇప్పటికే ఓసారి సీరియస్ అయింది. రీజనబుల్ టైమ్‌పై మరోసారి అసెంబ్లీ స్పీకర్‌పై ప్రశ్నలు కురిపించింది.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పటికే పది నెలలు పూర్తయ్యింది. అయినా స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో..పది నెలల సమయం రీజనబుల్ టైమ్ కాదా అని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మిగతా విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ క్రమంలో 18న జరగబోయే వాదనలపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ మాత్రం నెక్స్ట్ హియరింగ్‌లో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందని భావిస్తోంది. ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు పక్కా..ఉప ఎన్నికలు కూడా ఖాయం అంటూ ధీమాతో ఉంది.చట్ట ప్రకారం స్పీకర్ నిర్ణయాధికారానికి కాల పరిమితి లేదు. అందుకే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు స్పీకర్. అయితే గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే రిపీట్ కాబోతోందా అన్న చర్చ సాగుతోంది.అటు ఫిరాయింపుదారులపై వేటు పడుతుందని..ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలంటూ క్యాడర్‌కు ఇప్పటికే పిలుపునిచ్చారు. మాజీమంత్రి కడియం శ్రీహరి లేటెస్ట్ కామెంట్స్ చూస్తే..ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. దీంతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా..లేక సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తారా అన్నది ఆసక్తి రేపుతోందిబీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకా కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా.. మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి సుప్రీంకోర్టు విచారిస్తోంది.అయితే స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉందా..అందుకు రాజ్యాంగం నిబంధనలు ఒప్పుకుంటాయా అన్నదే చర్చనీయాంశం అవుతోంది. నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించవచ్చా? లేదా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.గతంలో మణిపూర్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసులో మాత్రం అనర్హత పిటిషన్లపై స్పీకర్ లిమిటెడ్ సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించిందే తప్ప నిర్దిష్ట ఆదేశాలేమీ ఇవ్వలేదు.ఇక, మరో కేసులో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే బాధ్యతలు స్పీకర్‌కు అప్పగించాలా? లేదా? అన్న విషయంపై పార్లమెంటే పునరాలోచించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు వేర్వేరు అభిప్రాయాలు, తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యేల కేసు విషయంలో ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనన్న చర్చ సాగుతోంది.గులాబీ నేతలు అయితే పది స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు. కేసీఆర్ కూడా ఉపఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట. అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లు టాక్. ఈ నెలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జహీరాబాద్ కార్యకర్తల భేటీలో చెప్పారు గులాబీ బాస్. అంతేకాదు కామారెడ్డి వేదికగా బీసీ బహిరంగ సభ పెట్టి..ఆ తర్వాత వరుస సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకే అనుకూలమని అంచనా వేస్తున్నారట గులాబీ నేతలు. అందుకే బైపోల్స్‌కు సై అంటున్నారు. గతంలో ఉప ఎన్నికల వచ్చినప్పుడు తాము గెలిచిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు.రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీమ్‌ల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం బైపోల్స్ ఎందుకు వస్తాయంటోంది. అయితే లీగల్ అంశాలతో పాటు స్పీకర్‌కు ఉన్న అధికారాలను బేస్ చేసుకుని ఉప ఎన్నికలు రావని రేవంత్ సర్కార్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు.. బై ఎలక్షన్స్ అన్న ముచ్చటే ఉండదని భావిస్తున్నారట. చూడాలి మరి బీఆర్ఎస్ ఆశించినట్లు ఉపఎన్నికలు రాబోతున్నాయా? లేక కాంగ్రెస్ ధీమాకు తగ్గట్లు సుప్రీం ఆదేశాలు ఉండే అవకాశం ఉందా అన్నది చూడాలి.