
ముంబై, ఫిబ్రవరి 11,
దేశంలోని వివిధ బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయలు నిరుపయోగంగా ఉంది. అంటే ఈ డబ్బుకు హక్కుదారుడు లేడు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధికంగా క్లెయిమ్ చేయని డబ్బు నిల్వలు పేరుకుపోయాయి. దీంతో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఒక ప్రచారాన్ని ప్రారంభిస్తోంది, తద్వారా ఖాతాదారులను గుర్తించి, క్లైమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. భారత ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరు తీసుకుని చేయని ఒకవేళ కోట్ల డబ్బును క్లైమ్ చేసుకోమంటూ పిలుపునిచ్చింది. భారత పౌరులు ఈ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అసలు ఏంటి ఈ అన్ క్లెయిమ్డ్ మనీ చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి ఆది క్లైమ్ చేయకుండానే చనిపోతారు. కుటుంబ సభ్యులకు కూడా ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయం కొన్నిసార్లు తెలియకుండా ఉంటుంది. ఇక కొంతమంది రకరకాలుగా బ్యాంకుల్లో స్కీముల రూపంలో డబ్బులు కట్టి మధ్యలో వదిలేస్తారు. ఇంకా కొంతమంది బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేయకుండా అలాగే వదిలేస్తారు. కానీ అందులో ఎంతో కొంత నగదు ఉండి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారైతే కంపెనీ మారినప్పుడల్లా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పాత బ్యాంక్ అకౌంట్ కి ఎంతో కొంత డిపాజిట్ చెల్లించి ఉంటారు. కానీ సరైన పద్ధతిలో బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయని కారణంగా ఆ డిపాజిట్ అక్కడే ఉండిపోతుంది. ఇంకొంతమంది బ్యాంకులో లాకర్లు తీసుకొని దానికి ఫిక్స్ డిపాజిట్ చేసి అలాగే మర్చిపోతారు. ఇలా చాలా రకాలుగా ప్రజల డబ్బు బ్యాంకుల్లో 78 వేల కోట్ల రూపాయలు ఉండిపోయాయి. తాజాగా ఈ సొమ్మునంత లెక్కకట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆ డబ్బుకు సంబంధించిన యజమానుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వివిధ బ్యాంకుల్లో జమ చేసిన ఈ అన్‌క్లెయిమ్ చేయని మొత్తం సంవత్సరం తర్వాత సంవత్సరం పెరుగుతోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.39,264 కోట్లు ఉంటే 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.48,262 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఇది కాస్తా 78 వేల కోట్ల రూపాయలు చేరింది. తన ప్రచారం కింద, బ్యాంకుల్లో గరిష్ట మొత్తంలో డబ్బు జమ అయ్యే ఎనిమిది రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఫోకస్ పెట్టింది. కేంద్ర బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం, క్లెయిమ్ చేయని డబ్బులో ఎక్కువ భాగం తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్‌లోని బ్యాంకుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే క్లైయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. సింపుల్‌గా కింద ఉన్న ఆర్‌బీఐ వెబ్‌సైట్ లింక్‌ను క్లిక్ చేస్తే మీకు విషయం సగం అర్థమవుతుంది. వెబ్‌సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటిపి ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పూర్తి పేరు, పాన్ నెంబర్ ఇచ్చి మీకు సంబంధించిన డబ్బులేమైనా బ్యాంకుల్లో ఉండిపోయాయని చెక్ చేసుకునే అవకాశం ఉంది. మీ డబ్బులు మాత్రమే కాదు మీ తాతలు, ముత్తాతలు ఎవరైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి మీకు తెలియకుండా అలాగే బ్యాంకుల్లో మీ డబ్బు ములుగుతుందేమో కూడా చూసుకోవచ్చు. అప్పట్లో తాతలకు, ముత్తాతలకు పాన్ కార్డు లేదు కదా అనే అనుమానం మీకు రావచ్చు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాన్ కార్డుతో పాటు, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ నెంబర్ ఇలా ఏదో ఒక ఆధారం ద్వారా ఆ వ్యక్తి డిపాజిట్లకు సంబంధించిన వివరాలను ఇస్తుంది. అయితే ఇది కేవలం బ్యాంకుల్లో బ్లాక్ అయిన ఆన్ క్లెయిమ్డ్ మనీ గురించి మాత్రమే వర్తిస్తుంది.