YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2027లో జమిలీ ఎన్నికలు చింతా మోహన్

2027లో జమిలీ ఎన్నికలు చింతా మోహన్

న్యూఢిల్లీ
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో దాగివున్న రాజకీయ రహస్యాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ బయటపెట్టారు. 2027లో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నాను. నిన్న నేను ఢిల్లీ వచ్చాను. కాసేపు అటూ, ఇటూ, తిరిగాను. ఢిల్లీలో దాగివున్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందని అన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, ప్యాకేజీలు కాదు. శాశ్వత గనులు కావాలి.  బళ్లారిలో వున్న ఇనుప ఖనిజ గనుల్లో ఒకటి విశాఖ ఉక్కుకు కేటాయించాలి. జార్ఖండ్ రాష్ట్రంలో వున్న బొగ్గు గనుల్లో ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వాలి.  కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారూ... ఉత్త మాటలు ఆపండి. మా ఏపీ ప్రయోజనాలను కాపాడండి. ఉక్కు ఫ్యాక్టరీ పై ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల కుటుంబాల ప్రయోజనాలను కాపాడే విధంగా శాశ్వత ఘనులు వెంటనే కేటాయించాలని కోరుతున్నానని అన్నారు.
ఒక ముఖ్యమంత్రి పోలవరంలో 6000 కోట్లు అక్రమంగా సంపాదించాడు. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. పోలవరం అవినీతిపై విచారణ జరిపించాలని ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు చాలా భయస్తుడు.  కాస్తో... కూస్తో... భయం, నీతి ఉంది. చాలా జాగ్రత్త పరుడు. పార్టీలు వేరైనా, మా ఇద్దరిదీ ఒకటే ప్రాంతం. చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసుని అన్నారు.

Related Posts