
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. మొన్నటి ఖమ్మం వరదల సమయంలో అక్కడి ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని చెప్పారు. బర్త్ డే ఫంక్షన్ లకు పోవడానికి హెలికాప్టర్ లను ఉపయోగిస్తున్న మంత్రులు, ఖమ్మం వరదలప్పుడు మాత్రం హెలికాప్టర్ లు పంపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనానికి ఓ కుటుంబం వదరల్లో కొట్టుకుపోయిందని కేటీఆర్ ఆరోపించారు.
ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషమున్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడు. కానీ కానీ రేవంత్ రెడ్డికి రేశం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడు. మా స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవ్వాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుంది. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్ లో చెప్పా . డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు.