
విజయవాడ, ఫిబ్రవరి 12,
ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. సభాసమరం స్టార్ట్ కాకముందే ఇంతలోపే ఏపీ పాలిటిక్స్ హైవోల్టేజ్‌కు చేరుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ చుట్టే వ్యవహారం తిరుగుతోంది. వైసీపీకి పదకొండు సీట్లే ఉన్నాయ్..ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి సర్కార్ అంటోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామని వైసీపీ డిమాండ్ చేస్తోంది.ఈ పరిస్థితుల్లో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చి..పెద్ద బాంబే పేల్చారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్తూనే..సభకు రాకపోతే వేటేనని కరాఖండిగా చెప్పేశారు. 60 రోజులు సభకు రాకపోతే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అవుతుందని..అది రూల్స్ బుక్‌లోనే ఉందని గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి హీటెక్కాయి ఏపీ పాలిటిక్స్.గత ఏడాది జూన్ తర్వాత జరిగిన ఏపీ అసెంబ్లీలో అధికార పక్షమే ఉంది. విపక్ష వైసీపీ అయితే సభకు వెళ్లడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది. కానీ అది అయ్యే పని కాదని రూల్స్‌ను ప్రస్తావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏకంగా 15రోజుల పాటు జరగబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరు అవుతుందా అన్నది ఆసక్తిని పెంచుతోంది.అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అని ఒక పక్కన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. దాంతో వైసీపీ సభకు అటెండ్ కాక తప్పదా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో కూటమి పార్టీలకే 164 సీట్లు ఉన్నాయి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంతో పాటు విపక్ష హోదా ఇవ్వరు కాబట్టి జగన్‌తో పాటు అంతా సాధారణ ఎమ్మెల్యేలుగానే ఉంటారు.సాధారణ ఎమ్మెల్యేగా ఉంటే తనకు ఇచ్చే సమయం కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు జగన్. విపక్ష నేతగా ఉంటే కచ్చితంగా మైక్ దక్కుతుందని భావిస్తున్నారు. అపోజిషన్ హోదా ఉంటే సీఎం కానీ మంత్రులు కానీ మాట్లాడిన తర్వాత కౌంటర్ చేయడానికి వీలు ఉంటుంది. కానీ ఈసారి జగన్ సభకు వస్తే ఒక సాధారణ సభ్యుడికి ఇచ్చినట్లే అతి తక్కువ సమయం దక్కనుంది.ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు ఎక్కువ టైమ్ ఇవ్వరని..సభకు రాకుండా ఉంటే అనర్హత వేటు వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వం పెద్ద వ్యూహంతోనే ఈ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకు చూపి వైసీపీ సభకు అటెండ్ కాకపోతే..11 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తుందట. అందులో భాగంగానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పేశారని అంటున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే కూడా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా తప్పు పట్టే అవకాశాలు ఉండవని లెక్కలు వేసుకుంటున్నారట.సిచ్యువేషన్ చూస్తుంటే బాల్ ఇప్పుడు వైసీపీ కోర్టులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ సభ్యులు సభకు అటెండ్ కాకపోతే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోందట. ఆ విషయం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోనని ఇప్పటికే చెప్పేశారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 12న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని..ఆ మీటింగ్‌లో అసెంబ్లీకి హాజరు కావాలా వద్ద అన్న దానిపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు.అయితే చాలామంది వైసీపీ నేతలు మాత్రం శాసనసభా సమావేశాలకు వెళ్లడమే బెటరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇచ్చిన టైమ్‌లోనే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేలా సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్లాలని సూచిస్తున్నారట. ఒకవేళ సభలో మాట్లాడే టైమ్ ఇవ్వకపోతే వాకౌట్ చేసి ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉండనే ఉందని గుర్తు చేస్తున్నారట. జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే 11మందిలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు అయిన కొందరు వైసీపీ సభ్యులు..తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవాలని ఆశ పడుతున్నారు. అధ్యక్షా అని సభలో తన గళం వినిపించాలని అనుకుంటున్నారట. దాంతో జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీ హాజరవుతారా.? లేక ఏమైనా చేసుకోనీ అని ప్రతిపక్ష హోదా డిమాండ్‌కే కట్టుబడి ఉంటారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.