YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా యమ్6

ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా యమ్6
విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’. జైరామ్ దర్శకుడు. విశ్వనాథ్ తన్నీరు, సురేష్ నిర్మాతలు. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను క్వాలిటీలో రాజీ పడకుండా నిర్మించాం. ఈ చిత్రంలోని ‘ఈ క్షణం..’ అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.దర్శకుడు జైరామ్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో సస్పెన్స్‌తో పాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిచాం. చక్కని ఫోటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి’’ అన్నారు. హీరో ధ్రువ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి చిత్రం. ఓ మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

Related Posts